ఐబీపీఎస్ లో డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు..
- August 05, 2019
భారతదేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100లు, ఇతరులు రూ.600 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 28 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. రెండు దశల్లో రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్ ట్రైనీలు: 4336 పోస్టులు…. అర్హత: ఏదైనా డిగ్రీ..వయోపరిమితి: 01.08.2019 నాటికి 20 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా ..ఎంపిక విధానం: ప్రిలిమనరీ, మెయిన్స్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 07.08.2019.. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 28.08.2019.. ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ సెప్టెంబర్ 2019. ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ పరీక్ష తేదీ 23.09.2019 నుంచి 28.09.2019. ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్) కాల్ లెటర్ డౌన్‌లోడ్ అక్టోబరు 2019. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబరు 12,13,19,20. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అక్టోబరు/నవంబరు 2019. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్ నవంబరు 2019. మెయిన్ ఎగ్జామ్ 30.11.2019. మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు డిసెంబరు 2019. ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ జనవరి 2020. ఇంటర్వ్యూ జనవరి/ఫిబ్రవరి 2020. నియామకం ఏప్రిల్ 2020.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







