జయలలిత వాట్సాప్ ప్రచారం..రూ.50 కోట్లు ఖర్చు!
- January 07, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా వాట్సాప్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల చెన్నై మహానగరాన్ని భారీ వరదలు ముంచెత్తిన విషయం తెల్సిందే. ఆ సమయంలో వరద బాధితులను కలుసుకునేందుకు వాట్సాప్ ద్వారా ప్రచారం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చు చేసినట్టు విపక్ష పీఎంకే నేత డాక్టర్ రాందాస్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. రాందాస్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపింది. ఓ టెలికాం సంస్థ 70 శాతం వరకు రాయితీ కల్పించడం వల్ల వాట్సాప్ ప్రచారానికి రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని పేర్కొంది. వరద బాధితులను నేరుగా కలుసుకోవడం సాధ్యం పడని కారణంగా ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం అందుబాటులో వున్న సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నారని అధికారులు వివరణ ఇచ్చారు. ఈ వాస్తవాలను దాచి రాజకీయ లబ్ది కోసం పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు ఆరోపించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







