అబుదాబీ పోర్ట్స్ కొత్త రికార్డు
- January 07, 2016
యూఏఈలోని ఖలీఫా ఇండస్ట్రియల్ జోన్, ప్రధాన పోర్టులను నిర్వహిస్తున్న అబుదాబీ పోర్ట్స్ 2015లో కార్గో వాల్యూమ్ పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అబుదాబీ టెర్మినల్స్ (అబుదాబీ పోర్ట్స్ సబ్సిడరీ సంస్థ) నిర్వహిస్తోన్న ఖలీఫా పోర్ట్ కంటెయినర్ టెర్మినల్ 2015లో 1,504,293 టియుఇ (ట్వంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్స్ / కంటెయినర్స్)ని మేనేజ్ చేసింది. 2014లో ఈ సంఖ్య 1,137,679 టియుఇలుగా ఉంది. 32 శాతం వృద్ధి కన్పించింది ఈ విభాగంలో.రోల్ ఆన్ రోల్ ఆఫ్ ట్రాఫిక్ 27 శాతం వృద్ధి చెందింది. 2015లో జాకెద్ పోర్ట్ నుంచి ఖలీఫా పోర్ట్‌కి ఈ రోల్ ఆన్ రోల్ ఆఫ్ ఆపరేషన్లు బదిలీ చేయబడ్డాయి. జనరల్ మరియు బల్క్ కార్గో 20 శాతం వృఇ్ధ నమోదు చేసింది. 15,310,847 మిలియన్ ఫ్రైట్ టన్స్ కార్గో అయ్యింది. గతంలో ఈ మొత్తం 12,804,248 మిలియన్ ఎఫ్‌టిగా ఉంది. అబుదాబీ క్రూయిజ్ ఇండస్ట్రీలో 16 శాతం పెరుగుదల కనిపించింది. జాయెద్‌లోని అబుదాబీ క్రూయిజ్ టెర్మినల్ ఇదే గ్రోత్‌ని ముందు ముందు కూడా కొనసాగింనుందనే అంచనాలున్నాయి. అబుదాబీ పోర్ట్స్ బిజినెస్, ఎమిరేట్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో తమవంతు కృషి చేస్తున్నందుకు ఆనందంగా ఉందని సీఈఓ కెప్టెన్ మహమ్మద్ సుమా అల్ షమిసి చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







