కోచి ఎయిర్‌పోర్ట్ మూసివేతతో యూఏఈ ప్రయాణీకుల అవస్థలు
- August 09, 2019
కేరళలో వరదల కారణంగా కోచి అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయడంతో, యూఏఈ నుంచి ఇప్పటికే కోచి వెళ్ళేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని విమానాల్ని దారి మళ్ళించడం, మరికొన్ని విమానాల్ని రద్దు చేయడంతో ప్రయాణీకుల వెతలు పెరిగాయి. ఈద్ అల్ అదా సెలవుల కారణంగా లాంగ్ వీకెండ్‌ని ఎంజాయ్ చేయాలనుకున్నవారికి నిజంగానే ఇది బాధాకరమైన విషయం. ఆగస్ట్ 11 వరకు కోచి విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల కావడంతో, విమానాల్ని రద్దు చేయడమో, ఇతర ఎయిర్‌పోర్ట్‌లకు మళ్ళించడమో చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఫ్లై దుబాయ్, ఎయిరేట్స్, స్పైస్ జెట్, ఇండిగో విమానాలు రద్దు కాగా, అబుదాబీ నుంచి ఎతిహాద్ విమానం, షార్జా నుంచి ఎయిర్ అరేబియా మరియు ఎయిర్ ఇండియా విమానాలు ర్దయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







