66వ జాతీయ అవార్డుల ప్రకటన
- August 09, 2019
భారత దేశ రాజధాని దిల్లీలో ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమం జరిగింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా ‘మహానటి’కి అవార్డు దక్కింది. అలాగే జాతీయ ఉత్తమ నటి అవార్డు కీర్తి సురేష్ కు దక్కింది. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో నటించారు. సమంత, విజయ్‌దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లు ఇతర పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. ఈసారి జాతీయ పురస్కారాల్లో మహానటితో కలిపి ఐదు తెలుగు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి||ల||సౌ||’
* ఉత్తమ నటి: కీర్తిసురేశ్(మహానటి) * జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్ * జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి * జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్ * జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్ * ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
* జాతీయ ఉత్తమ యాక్షన్ చలన చిత్రం: కేజీఎఫ్ * ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్) * ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం: చి||ల||సౌ||
* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ‘అ!’(తెలుగు)కేజీఎఫ్(కన్నడ) * ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ) * ఉత్తమ మేకప్: ‘అ!’ * ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్: మహానటి * ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కమ్మార సంభవం(మలయాళం) * ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి(కన్నడ) * ఉత్తమ సౌండ్ డిజైనింగ్: ఉరి * ఉత్తమ అడాప్టెడ్ స్క్రీప్‌ప్లే: అంధాధున్ * ఉత్తమ సంభాషణలు: తారీఖ్(బెంగాళీ) * ఉత్తమ గాయని: బిందుమలినిఫ్(నాతి చరామి: మాయావి మానవే) * ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్(పద్మావత్: బింటే దిల్) * ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్, షాహిబ్ సింగ్, తలాహ్ అర్షద్ రేసి, శ్రీనివాస్ పోకాలే
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..