క్షణాల్లో మన కళ్లెదుట మొబైల్ యాప్స్ ...
- January 07, 2016
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం మానవ మనుగడను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. అదే పరిజ్ఞానం మనిషికి అవసరమున్న సేవలను అరచేతిలోకి తీసుకొచ్చింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కోరుకున్నది క్షణాల్లో మన కళ్లెదుట ప్రత్యక్షమవుతుందంటే దాసోహం కానిదెవరు..? అదంతా మొబైల్ యాప్స్, మొబైల్ అప్లికేషన్ల పుణ్యమే. షాపింగ్ చేయాలన్నా, రైల్వే, సినిమా, విమాన టికెట్లు బుక్ చేయాలన్నా, యోగా, డైట్ కావాలన్నా మనకు తెలియని ఇతర భాషా పదాల అర్థం తెలుసుకోవాలన్నా.. హార్ట్ బీటు చూసుకోవాలనుకున్నా, గర్భిణులకు సూచనలు కావాలన్నా, వంట చేయాలన్నా, బ్యాంక్ లావాదేవీలు నిర్వహించాలన్నా.. ఉద్యోగ అవకాశాలు.. ఇలా ఒకటేమిటీ... అన్ని పనులకు మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
మొబైల్ యాప్ అంటే...
మొబైల్ యాప్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్. ప్రత్యేకంగా స్మార్ ్టఫోన్లతో ప్రత్యేకమైన సౌకర్యాలు పొందేందుకు వీలుగా ఈ ప్రోగ్రామ్ తయారు చేయబడి ఉంటుంది. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో లెక్కకు మించి యాప్స్ సందడి చేస్తున్నాయి. 2015 ఏప్రిల్‌లో భారతదేశంలో బ్లాగ్ జన డాట్ కామ్ అనే సంస్థ సర్వే చేసి మొబైల్ యాప్‌ను పలు విభాగాలుగా విభజించింది. దీంట్లో కమ్యూనికేషన్ విభాగం అధిక శాతం 33ఉండగా, షాపింగ్ టూల్స్‌కు సంబంధించిన యాప్స్ 17శాతం ఉన్నాయి. మీడియా 8శాతం, ఎంటర్‌టైన్‌మెంట్ 8శాతం, హెల్త్, గేమ్స్, వంటలు తదితరాలు 17శాతం ఉన్నాయి.
మొబైల్ యాప్స్ పలు రకాలు...
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న వారికి మొత్తం వెయ్యికి పైగా యాప్స్ ఉన్నట్లు సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. బిజినెస్ కామిక్స్, కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫైనాన్స్, గేమ్స్, హెల్త్, జీవన నైపుణ్యాల మీడియా, మ్యూజిక్ ట్రాన్స్‌పోర్టేషన్, వాతావరణం ఇలా అనేకమైన యాప్స్ స్మార్ట్‌ఫోన్లలో హాల్‌చల్ చేస్తున్నాయి.
మ్యూజిక్ యాప్...
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న యువత ఫోన్లో ఈ యాప్ తప్పకుండా ఉంటుంది. ఇది భారతదేశంలోని అన్ని భాషల పాటలను, రేడియో స్టేషన్లను మనకు అందిస్తుంది. అయితే మనం ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ఎఫ్‌ఎంలకు అనుసంధానం అవుతుంది. అక్కడ భాషాపరమైన రేడియో ప్రసారాలను మనకు అందిస్తుంది.
జీపీఎస్ రూట్ యాప్...
ఎక్కడ ఉన్నాయో చూసుకునేందుకు, ఎటు వెళ్లాలో దారి తెలుసుకునేందుకు ఈ యాప్‌ను వాడుతున్నారు. మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడికి వెళ్లాలో టైప్ చేస్తే చాలు... కాలి నడక బాటను, వాహన దారి మార్గాన్ని ఇట్టే చూపిస్తుంది. దీంతో మనం రూట్ మ్యాప్‌ను తెలుసుకోవచ్చు.
అర చేతిలో నిఘంటవు...
ఇంగ్లీష్ పదాల అర్థాల కోసం మనం ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్‌లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ యాప్ ఉంటే చాలు 3 లక్షల యాభైవేల పదాలకు అర్థాలు దొరుకుతాయి. అంతే కాదు ఎన్నో వాక్యాలు, మరెన్నో పదాలకు అర్థాలు ఇట్లే తెలుసుకోవచ్చు.
మొబైల్ రిమోట్...
టీవి రిమోట్ అవసరం లేకుండానే స్మార్ట్ ఫోన్‌లోని ఓ రిమోట్ యాప్‌తో టీవీని ఆపరేట్ చేయవచ్చు. 100కు పైగా కంపెనీల టీవీలను ఈ యాప్‌తో ఆపరేట్ చేయవచ్చు.
మై డాటా మేనేజర్...
ఇది అన్ని యాప్‌ల కంటే అత్యంత కీలకమైన యాప్. మనం ఇంటర్నెట్ ఆధారిత సేవలను వినియోగించుకునేటప్పుడు ఎంత డాటా వరకు ఉపయోగించాం ఇంకెంత మనకు అందుబాటులో ఉందన్న అంశాన్ని ఈ యాప్ ద్వారా తెల్సుకోవచ్చు. ఎప్పటికప్పుడు మనం వాడుకుంటున్న డాటాను ట్రాక్ చేస్తూ మనకు తెలియజేస్తుంది.
యాత్రకు గైడ్స్ యాప్ లే...
యాత్ర డాట్‌కామ్ వారు యాత్రికుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ఇది. దీంతో ఉన్నచోటు నుంచి టికెట్లు, రిసార్ట్‌లు, హోటళ్లు, పర్యాటక ప్రదేశాల వివరాలు తెలుసుకోవచ్చు. అక్కడికి వెళ్లేందుకు ఈ యాప్ అన్ని విధాలా సహకరిస్తుంది.
ఇండియన్ రైల్ యాప్...
ఇది అత్యంత ప్రజాదరణ పొందిన యాప్. రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ మొదలు రైలు గురించిన సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్రేస్‌చేసి ప్రయాణికులకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు తెలియజేస్తుంది.
ఆరోగ్య రంగంలో...
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మనం మన హార్ట్ బీటును మెడికల్ పరికరాలు లేకుండా చూసుకోవచ్చు. దీనికి ఫోన్‌లు ఇన్‌స్టాంట్ హార్ట్ రేటింగ్ యాప్ ఉంటే చాలు మన హార్ట్ రేట్ తో పాటు బీపీలను కూడా చెక్ చేసుకోవచ్చు. గర్భ్ సంస్కార్ అనే యాప్ గర్భిణుల ఆహారపు అలవాట్ల గురించి వారి సమస్యలు వైద్య నిపుణుల సలహాలను, సూచనలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.
ఎక్కువ యాప్స్ వాడకంతో చార్జింగ్ డౌన్...
యాప్స్ మన చెంత ఉంటే ఏ దిగులు పడకుండా సకల సౌకర్యాలు పొందొచ్చు. యాప్స్ వాడకం తెలిస్తే శ్రమ తక్కువ, ఆదాయం ఆదా, వేరే వ్యక్తుల సహాయం అవసరం లేదు. కంప్యూటర్‌లో యాప్స్ డౌన్ లోడ్ ఉండదు. కేవలం సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. స్మార్ట్ ఫోన్లో మాత్రమే యాప్స్ సౌలభ్యం ఉంటుంది. యాప్స్ డౌన్‌లోడ్‌లో జాగత్రగా ఉండాలి కొన్ని యాప్‌లు మొబైల్‌ను పాడు చేసే అవకాశం ఉంది. గేమ్స్ యాప్ అయితే బ్యాటరీ చార్జీంగ్ తరచూ పోతూ ఉంటుంది. బ్యాటరీ డాక్టర్ అనే యాప్ ఫోన్‌లో బ్యాటరీ చార్జింగ్ ఎంత సమయం ఉంటుందో తెలియజేస్తుంది. అంతేకాదు యాప్‌లు అదనంగా వాడుతున్న పవర్‌ను నిర్మూలిస్తుంది. ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఉపయోగపడేలా చేస్తుంది. సర్కారీ నౌకరి అనే యాప్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ప్రత్యేకంగా ఉపయోగపడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను, ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగాల సమాచారాన్ని సంపూర్ణంగా మనకు అందజేస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







