రికార్డు స్థాయిలో H1B వీసాలు రిజెక్ట్!
- August 10, 2019
అమెరికా:ఒక అమెరికా బేస్డ్ రీసెర్చ్ సంస్థ చేసిన పరిశోధనలో పలు విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే ఇండియాలోని టాప్ ఐటీ కంపెనీలు అమెరికా ప్రభుత్వం నుండి ఒకేరకమైన ఇబ్బందికర సమస్యను ఎదుర్కొంటున్నాయట. నిజానికి మన దేశంలో నాలుగు టాప్ ఐటీ కంపెనీలు ఉన్నాయి, అవేంటంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్. ఈ నాలుగు కంపెనీలకి అమెరికా నుండి వీసా రిజెక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయని సదరు సంస్థ తేల్చింది. గతంలో పోలిస్తే ఇలా రిజెక్ట్ కావడం ఎక్కువయిందని ఆ సంస్థ తమ పరిశోధనలో తేల్చింది. ఉదాహరణకి టీసీఎస్ విషయాన్నే తీసుకుంటే ఫైనాన్సియల్ ఇయర్ 2015లో ఈ పర్సెంటేజ్ ఆరు శాతం ఉండగా ఫైనాన్సియల్ ఇయర్ 2019లోని మొదటి క్వార్టర్ లో అది ఏకంగా 37శాతానికి ఎగబాకింది.
ఇక మిగతా వాటి పరిస్థితి కూడా దాదాపు అదే. ఈ పరిస్థితికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే అని చెబుతున్నారు. ఎందుకంటే అమెరికన్ లకే ఎక్కువ శాతం ఉద్యోగాలు అనే నినాదంతో ట్రంప్ పని చేస్తున్నారు అందుకే పెద్ద ఎత్తున వీసాలను రిజెక్ట్ చేయడమే కాక రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడంతో మామూలు వీసాలు కాక హెచ్ వన్ బీ వన్, ఎల్ వన్ వీసాలు కూడా అప్రూవ్ అవ్వని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అమెరికన్ ఉద్యోగులతో పని చేయించుకుని వారికీ అధిక జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఈ టాప్ కంపెనీల అమెరికా నుండి కాంట్రాక్ట్ లు తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాని సదరు పరిశోధనా సంస్థ తేల్చింది. ఇక ఈ విషయం మీద ఆ కంపెనీలు అయితే ఏమీ స్పందించలేదు.
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







