పేలిన ఆయిల్ ట్యాంకర్.. 62 మంది మృతి..
- August 10, 2019
టాంజానియా :ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది.. గుంపులుగా వచ్చి ఆయిల్ పట్టుకొని వెళ్తున్నారు.. ట్యాంకర్ బోల్తా పడిందంటేనే జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఓ వ్యక్తి చేసిన తప్పిదం 62 మంది ప్రాణాలు తీసింది.. ఈ ఘోర ప్రమాదం టాంజానియాలో జరిగింది. టాంజానియా రాజధాని దార్ ఎస్ సలామ్‌కు పశ్చిమంగా వున్న మొరగొరోలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది.. ఇక ప్రమాదానికి గురైన ట్యాంకర్ నుంచి స్థానికులు పెట్రోల్ తీసుకెళ్లేందుకు చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి సిగరెట్ ముట్టించడంతో.. 62 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో 70 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.. ఈ ఘటనలో 62 మంది మృతిచెందినట్టు నిర్ధారించారు పోలీసులు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..