పాకిస్తాన్ లో సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
- August 11, 2019
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతోన్న పాకిస్థాన్.. మరో దుశ్చర్యకు పాల్పడింది. లాహోర్ లోని సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. గుర్తుతెలియని కొందరు ఆందోళనకారులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అనంతరం వీధుల వెంట కేకలు వేసుకుంటూ వెళ్లినట్టు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న లాహోర్ సిటీ అధికార ప్రతినిధి తానియా ఖురేషి.. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దెబ్బతిన్న విగ్రహాన్ని బాగు చేయించి తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో అల్లరి మూకలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







