మానవత్వం చాటుకున్న బెజవాడ పోలీసులు

- August 11, 2019 , by Maagulf
మానవత్వం చాటుకున్న బెజవాడ పోలీసులు

బెజవాడ పోలీసులు మానవత్వం చాటుకుంటున్నారు. బాధితులకు, నిరుద్యోగులకు అండగా నిలుస్తూ.. మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. విజయవాడ పోలీస్ కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ద్వారక తిరుమలరావు సిబ్బందిలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. సమాజ సేవలో పోలీసులను బాగస్వామ్యులను చేస్తున్నారు.
పోలీస్ శాఖ స్థలాలలో చాలా చోట్ల షాపింగ్ కాంప్లెక్స్, పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసి.. నిరుద్యోగులు.. మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మంచి ఆలోచన దృక్పథంతో నగరంలో వేదవ్యాస్ పోలీస్ కాంప్లెక్స్‌లో భారత్ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి.. పలువురికి ఉద్యోగాలు కల్పించారు. పోలీస్ పెట్రోల్ బంక్‌లో దాదాపు 52 మంది యువతులు, మహిళలు, యువకులు క్యాష్ కలెక్టర్, పెట్రోల్ పంపింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు.

ఆఫీసుల్లోనూ.. బయట ప్రస్తుతం మహిళలకు ఎలాంటి భద్రత లేదని.. ఇలాంటి ఇలాంటి రోజుల్లో పోలీసుల పర్యవేక్షణలో ఉండే పెట్రోల్ బంక్ లో పనిచేయడం తమకు చాలా సంతోషంగా ఉందంటున్నారు మహిళా ఉద్యోగులు. బెజవాడ పోలీసులు తమని ఒక ఉద్యోగిగా మాత్రమే చూడకుండా సొంత కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బెజవాడలో ప్రస్తుత పరిస్థితులు మారాయి. ప్రజల్లో కూడా పోలీసులంటే భయం పోయింది అన్నారు విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారక తిరుమలరావు. పోలీసులు కూడా బాధితుల పట్ల మర్యాదగా నడుచుకోవడం.. వారి సాధక బాధలను విని వారిపట్ల ప్రేమపూర్వకంగా నడుచుకుంటున్నారని గుర్తు చేశారు. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అయిందని.. ఇపుడు రాష్ట్రంలోనే పెట్రోల్ పంపింగ్‌లో మొదట స్థానంలో రోజుకు 25 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుందని అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సమయాలలో వస్త్రాలు కూడా ఇస్తున్నామన్నారు ద్వారకా తిరుమల రావు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com