కటారా కల్చరల్ విలేజ్‌లో ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్
- August 12, 2019
ఖతార్: గత కొన్ని సంవత్సరాలుగా కటారా కల్చరల్ విలేజ్, ప్రముఖ ఈవెంట్స్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి గొప్ప వేదికగా ఖతార్‌లో అభివృద్ధి చెందింది. ఈ ఈద్ సందర్భంగా కటారా కల్చరల్ విలేజ్, పెద్దలకు పిల్లలకు అద్భుతమైన కార్యక్రమాలతో సిద్ధమయ్యింది. ఆగస్ట్ 14 వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయి. త్రీడీ షోలు (డాన్ ఆఫ్ ది స్పేస్ ఏజ్, ది పెర్‌ఫెక్ట్ లిటిల్ ప్లానెట్, ఆస్ట్రోనాట్) ఇక్కడి ప్రధాన ఆకర్షణలుగా వున్నాయి. మిలిటరీ బ్యాండ్ మ్యూజికల్ ప్రెజెంటేషన్ మరో ప్రధాన ఆకర్షణ. పిల్లలకు కటారా కల్చరల్ విలేజ్‌లో ప్రత్యేకంగా వినోద కార్యక్రమాల్ని పొందుపరిచారు. రాత్రి 10 గటలకు ఫైర్ వర్క్స్ మరో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. వేలాది మంది ఈ ఈవెంట్‌లో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







