ఇంటర్నేషనల్‌ యూత్‌ డే: నామా వర్క్‌ షాప్‌

ఇంటర్నేషనల్‌ యూత్‌ డే: నామా వర్క్‌ షాప్‌

ఇంటర్నేషనల్‌ యూత్‌ డే సందర్భంగా సోషల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ 'నామా', బర్జాన్‌ గర్ల్స్‌ సెంటర్‌, బర్జాన్‌ యూత్‌ సెంటర్‌తో కలిసి యూత్‌కి సంబంధించి కొన్ని ట్రెయినింగ్‌ కోర్సుల్ని నిర్వహించడం జరిగింది. వర్క్‌ షాప్‌లు, ట్రెయినింగ్‌ కోర్సుల ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యాల్ని పెంచడం, వారిలో ప్రత్యేకమైన నైపుణ్యాల్ని వెలికి తీయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఔత్సాహిక యువతలోని టాలెంట్‌ని గుర్తించి, వారు మెరుగైన రీతిలో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా చేసేందుకు 'నామా' తనవంతు కృషి చేస్తుందని నిర్వాహకులు వివరించారు. నామా సెంటర్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా యాక్టింగ్‌ మేనేజర్‌ హమాద్‌ అల్‌ మర్రి మాట్లాడుతూ, ఈ ఇయర్‌ ఇంటర్నేషనల్‌ యూత్‌ డే సందర్భంగా 'ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌' పేరుతో కార్యక్రమాల్ని నిర్వహించినట్లు చెప్పారు. 

Back to Top