జ్లీబ్‌ అల్‌ షుయోక్‌లో అగ్ని ప్రమాదం

జ్లీబ్‌ అల్‌ షుయోక్‌లో అగ్ని ప్రమాదం

కువైట్‌ సిటీ: జ్లీబ్‌ అల్‌ షౌక్‌ ప్రాంతంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదం కారణంగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే ఫైర్‌ ఫైటర్స్‌ అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. ఇరుకైన రోడ్ల కారణంగా సంఘటనా స్థలానికిచేరుకోవడానికి అధికారులకు కొంత సమయం పట్టింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామనీ, ప్రమాదానికి గల కారణాలు పూర్తి విచారణ తర్వాత వెల్లడవుతాయని పేర్కొన్నారు ఆ ప్రకటనలో. కార్పెట్స్‌, ఫర్నిచర్‌, టెంట్స్‌, స్పాంజెస్‌ ఈ అగ్ని ప్రమాద తీవ్రతను మరింత పెంచాయి.

Back to Top