సముద్రంలో మునిగిపోయిన యువకుడు

సముద్రంలో మునిగిపోయిన యువకుడు

మస్కట్‌: 21 ఏళ్ళ యువకుడు సముద్రంలో మునిగిపోయాడు. అతని ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఒమన్‌లోని సదరన్‌ అల్‌ షర్కియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకోగానే పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ వర్గాలు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. అల్‌ అష్కారాలోని సముద్రంలో యువకుడు మునిగిపోయినట్లు అధికారులు వివరించారు. ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని పిఎసిడిఎ ఓ ప్రకటనలో పేర్కొంది. 

Back to Top