బస్‌, కారు ఢీ: 21 మంది కార్మికులకు గాయాలు

బస్‌, కారు ఢీ: 21 మంది కార్మికులకు గాయాలు

దుబాయ్:21 మంది బ్లూ కాలర్డ్‌ వర్కర్స్‌ ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముహౌసినాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాద బాధితుల్ని అల్‌ నహ్దాలోని ఎన్‌ఎంసి హాస్పిటల్‌కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారికి 18 మంది మెడికల్‌ స్టాఫ్‌ వైద్య చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గాయపడ్డవారిలో ఒక ఇండియన్‌ కూడా వున్నారు. 8 మంది బంగ్లాదేశీలు, ఆరుగురు నేపాలీయులు, నలుగురు పాకిస్తానీయులు, ఒక కెన్యన్‌, ఒక గాంబియన్‌ కూడా వున్నట్లు అధికారులు తెలిపారు. 19 మంది పేషెంట్లకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయనీ, ఇద్దరికి ఓ మోస్తరు గాయాలయ్యాయనీ, ఒకరికి సీరియస్‌గా వుందని వైద్యులు వివరించారు. 

Back to Top