ఇండోనేషియా రాజధాని మారింది..కారణమేంటో చదవండి..
- August 18, 2019
ఇండోనేషియా దేశంలో తరచుగా భూకంపాలు, సునామి, వరదలు వస్తుంటాయి. దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ ముప్పు ఇండోనేషియాలోని మిగతా ప్రాంతాలకంటే ఆ దేశ రాజధానిపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నది. దీంతో ఆ దేశ రాజధానిని మార్చాలని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రకటించాడు.
ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ఈ విషయం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్ కు ఇండోనేషియా రాజధానిని తరలించనున్నట్టు అయన తెలిపారు. ప్రస్తుత రాజధాని జకార్తాలో ప్రతి సంవత్సరం 25 సెంటీమీటర్ల చొప్పున సముద్రంలో మునిగిపోతున్నదని.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక భాగం సముద్రంలో మునిగిపోతుందని నిపుణులు హెచ్చరించినట్టు ఆయన తెలిపాడు. అందుకే రాజధానిని జకార్తా నుంచి కాళీమంథన్ కు మార్చబోతున్నట్టు అయన తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







