కారులో చిన్నారిని రక్షించిన షార్జా పోలీస్
- August 19, 2019
అత్యంత వేడిగా వున్న సమయంలో ఓ చిన్నారిని కారులోనే వదిలేశారు తల్లిదండ్రులు. అల్ నధాలో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా, షార్జా పోలీసులు కారులోని చిన్నారిని రక్షించారు. చిన్నారి కారులో చిక్కుకుపోయిన విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో, సకాలంలో పోలీసులు స్పందించారు. సంఘటనా స్థలానికి పోలీస్ పెట్రోల్ చేరుకుని, చిన్నారిని రక్షించడం జరిగింది. చిన్నారిని తల్లిదండ్రులు కారులో మర్చిపోయినట్లు గుర్తించారు. కారులో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడంతో, చిన్నారికి శ్వాసకోస సమస్యలు తలెత్తి, కారు డోరు కూడా తీయలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి బాగానే వున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







