పాకిస్థాన్ కు కానీ, చైనాకు కానీ మేము సపోర్ట్ చేయలేదు: బ్రిటన్
- August 21, 2019
బ్రిటన్: జమ్ముకశ్మీర్ అంశంపై గత శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి రహస్య సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. చైనా కోరిక మేరకు ఈ సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో పాకిస్థాన్ కు అనుకూలంగా బ్రిటన్ వ్యవహరించిందనే వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా బ్రిటన్ ఈ అంశంపై స్పందించింది. భద్రతామండలి సమావేశంలో పాకిస్థాన్ కు కానీ, చైనాకు గాని మద్దతుగా తాము వ్యవహరించలేదని బ్రిటన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
యూకే సీనియర్ దౌత్యవేత్త ఒకరు మాట్లాడుతూ, 'భద్రతామండలి రహస్య సమావేశంలో పాక్, చైనాకకు మద్దతుగా. భారత్ కు వ్యతిరేకంగా మేము వ్యవహరించలేదు. కశ్మీర్ అంశాన్ని ఇండియాపాకిస్థాన్ లే పరిష్కరించుకోవాలనేది తాము ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చైనా కోరింది. ఇందులో మా పాత్ర ఏమీ లేదు.
ఆర్టికల్ 370ని రద్దు చేయాలని భారత్ ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకుందనే విషయాన్ని చైనా చెప్పాలనుకుంది' అని తెలిపారు. సమావేశం తర్వాత ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని చెప్పారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని. కేవలం చర్చ మాత్రమే జరిగిందని అన్నారు. భారత్ కు వ్యతిరేకంగా తాము వ్యవహరించామనే వార్తలు అవాస్తవమని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







