సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్!!
- August 21, 2019
ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్‌లకు ఆధార్ లింక్ చేయడంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి పలువురు విద్వేష ప్రచారం, హింసకు ప్రేరేపించే ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని అడ్డుకోవాలంటే సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం ఒకటే మార్గమని తమిళనాడు ప్రభుత్వం వాదించింది.
సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం ద్వారా తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటూ తమిళనాడు హైకోర్టులో రెండు, మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒకటి, బాంబే హైకోర్టులో ఒకటి చొప్పున దేశవ్యాప్తంగా నాలుగు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఫేస్బుక్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కావాలంటే అకౌంట్లకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ తప్పనిసరి చేస్తామని. ఆధార్ లింక్ అన్నది ప్రజల గోప్యత హక్కు ఉల్లంఘనే అవుతుందని ఫేస్బుక్ వాదించింది.
తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఫేస్బుక్ వాదనను తోసి పుచ్చింది. తప్పుడు వార్తలను, పరువునష్టం కలిగించే వార్తలను, అశ్లీల చిత్రాలు, వీడియోలను, దేశ వ్యతిరేక, ఉగ్రవాద సందేశాలను అరికట్టడానికి. సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయడం అత్యవసరం అని తమిళనాడు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు.
ఆధార్‌తో లింక్ చేస్తే ఒక వ్యక్తికి ఒక సోషల్ మీడియా ఖాతా మాత్రమే ఉంటుందని. అప్పుడు నకిలీ ఖాతా సాయంతో విద్వేష ప్రచారం, సమాజంలో అలజడి సృష్టించే ప్రచారానికి చెక్ పడుతుందని వాదించారు. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







