పాక్‌కి మింగుడు పడని ఫ్రాన్స్ వైఖరి
- August 21, 2019
దిల్లీ: కశ్మీర్‌పై చేస్తున్న మొండి వాదనల నేపథ్యంలో దాయాది దేశం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటల్ని అదుపులో పెట్టుకోమని అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ హితబోధ చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఫ్రాన్స్ ప్రభుత్వం సైతం పాక్‌కు పలు సూచనలు చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సంయమనం పాటించాలని, ఉద్రిక్త పరిస్థితుల్ని రెచ్చగొట్టే చర్యలు చేపట్టవద్దని సూచింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి జీన్ డ్రియాన్ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీతో మాట్లాడారు. అలాగే కశ్మీర్ అంశం పూర్తిగా ద్వైపాక్షిక అంశమని, చర్చల ద్వారా దానిపై ఓ పరిష్కారానికి రావాలని సూచించారు. పరోక్షంగా పాకిస్థాన్‌కు తమ మద్దతు ఉండదని చెప్పకనే చెప్పారు.
అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు విఫలయత్నాలు చేస్తున్న పాక్‌కి ఫ్రాన్స్ వైఖరి మింగుడు పడని విషయమనే చెప్పాలి. ఐరాస భద్రతా మండలిలో ఫ్రాన్స్ శాశ్వత సభ్య దేశం కావడం గమనించాల్సిన విషయం. భారత్, పాక్ ప్రధాన మంత్రులతో ట్రంప్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఫ్రాన్స్ నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు బంగ్లాదేశ్ సైతం కశ్మీర్‌పై భారత్ నిర్ణయం పూర్తిగా అంతర్గత విషయమని తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







