యూఏఈలో 'రూపే' కార్డ్‌ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- August 22, 2019
యూఏఈ:మిడిల్ ఈస్ట్‌లో తొలిసారిగా యూఏఈలో రూపే కార్డ్ అందుబాటులోకి రానుంది. మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ తరహాలోనే ఇండియాకి చెందిన రూపే కార్డ్ పనిచేయనుంది. ప్రధాని నరేంద్రమోడీ, యూఏఈలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ రూపే కార్డ్‌ని ప్రారంభిస్తారని ఇండియాకి చెందిన టాప్ డిప్లమాట్ ఒకరు వెల్లడించారు. యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవ్‌దీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, ఇండియా మరయు యూఏఈ మధ్య ఈ మేరకు మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాడింగ్ జరిగిందనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే యూఏఈకి చెందిన మెర్క్యురీ పేమెంట్స్ సర్వీసెస్ మధ్య ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. రీజియన్‌లో యూఏఈ అతి పెద్ద వైబ్రెంట్ బిజినెస్ హబ్ అనీ, యూఏఈలో ఇండియన్ కమ్యూనిటీ పెద్దయెత్తున వుందనీ, ఈ నేపథ్యంలో రూపే కార్డ్ ఇక్కడ విజయవంతమవుతుందని ఆయన వెల్లడించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!