పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఎఫ్‌ఏటీఎఫ్‌ ఏపీజీ

- August 23, 2019 , by Maagulf
పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఎఫ్‌ఏటీఎఫ్‌ ఏపీజీ

ఆర్థిక చర్యల కార్యదళం ఆసియాపసిఫిక్‌ గ్రూప్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌ఏపీజీ) పాకిస్థాన్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు గ్రే లిస్ట్‌లో ఉన్న దాయాది దేశాన్ని ఎన్‌హాన్స్‌డ్‌ ఎక్స్‌పీడైటెడ్‌ ఫాలో అప్‌ లిస్ట్‌(బ్లాక్‌ లిస్ట్‌)లో చేర్చింది. ఈ మేరకు గత రెండు రోజులుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌ఏపీజీ సమావేశంలో నిర్ణయించినట్లు భారత అధికారులు తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన దిశగా తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను పాక్‌ ఇటీవల ఎఫ్‌ఏటీఎఫ్‌కి సమర్పించింది. పాక్‌ తీసుకున్న దాదాపు 40 రకాల చర్యల్లో దాదాపు 32 ఎఫ్‌ఏటీఎఫ్ నిబంధనలకు అనుగుణంగా లేవని ఆసియాపసిఫిక్‌ గ్రూప్‌ కుండబద్దలు కొట్టింది. అలాగే ఉగ్రవాదులకు నిధుల చేరవేత, అక్రమ నగదు చలామణి లాంటి కీలకమైన 11 విషయాల్లో పాక్‌ 10అంశాల్లో లక్ష్యాల్ని చేరుకోలేదని స్పష్టం చేసింది. 42 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో పాక్‌ చర్యలతో ఏ ఒక్కరూ సంతృప్తి చెందనట్లు సమాచారం. ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే అంశంలో పాక్‌ తీసుకున్న చర్యలు ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబంధనలకు అనుగుణంగా లేవని సభ్యులు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com