కౌసల్య కృష్ణమూర్తి:రివ్యూ

- August 23, 2019 , by Maagulf
కౌసల్య కృష్ణమూర్తి:రివ్యూ

నటీనటులుః ఐశ్వర్య రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌, శశాంక్‌, రవిప్రకాశ్‌

మ్యూజిక్ః దిబు నిన్నాన్‌ థామస్‌

సినిమాటోగ్రఫీః బి.ఆండ్ర్యూ

నిర్మాతః కేఎ వల్లభ

స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః భీమినేని శ్రీనివాసరావు

విడుదల తేదిః 23.08.2019

ఇటీవల కాలంలో స్పోర్ట్స్ కథతో సినిమాలు తెరక్కెడుతున్నాయి. క్రీడల నేపథ్యంలో వచ్చే సినిమాలు చాలా వరకు హిట్ కొడుతుండటంతో. దర్శక నిర్మాతలు ఇలాంటి సినిమావైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో తమిళంలో హిట్ కొట్టిన కణ అనే సినిమాను తెలుగులో కౌసల్య కృష్ణమూర్తిగా తెరకెక్కించారు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. తమిళంలో హిట్ కొట్టినట్టుగానే తెలుగులో కూడా ఈ సినిమా హిట్ అవుతుందా.. ప్రేక్షకులకు నచ్చుతుందా తెలుసుకుందాం.

కథః

రాజేంద్రప్రసాద్ ఒక సాధారణ రైతు. వ్యవసాయం చేయడం అంటే ఎంత ఇష్టమో .. క్రికెట్ ఆడటం అన్నా అంతే ఇష్టం. తండ్రిని చూసి ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ క్రికెట్ ఆడి కప్పు గెలిచి తండ్రి కళ్ళలో ఆనందం చూడాలని అనుకుంటుంది. కానీ, ఆమె తల్లి ఝాన్సీ మాత్రం అందుకు ఒప్పుకోదు. మగపిల్లలతో ఆటలేంటి అని అడ్డుపడుతుంది. ఊర్లో వాళ్ళు కూడా సూటిపోటి మాటలు అంటుంటారు. కానీ, వాటిని పట్టించుకోకుండా క్రికెట్ వైపు అడుగులు వేస్తుంది. అలా వేసిన అడుగులు లక్ష్యంవైపు సాగాయా..? అనుకున్నట్టుగా క్రికెట్లో రాణించిందా అన్నది మిగతా కథ.

కథనంః

క్రికెట్ అన్నది ప్రతి ఒక్కరికి నచ్చే గేమ్. గ్రౌండ్ కు వెళ్లి ఆడలేకపోయినా క్రికెట్ వస్తుంది అంటే టీవీలకు అతుక్కుపోయి కూర్చుంటారు. తిండిని కూడా మర్చిపోయి క్రికెట్ చూస్తుంటారు.తమిళంలో విజయం సాధించిన సినిమా కణ స్టోరీ కాబట్టి.. తమిళంలో ఉన్న ఎమోషన్స్ ను తెలుగులో కూడా క్యారీ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. ఓ మ్మాయి క్రికెటర్ గా ఎదిగే తీరు, రైతు పతనం రెండింటిని ఒకే కథలో ఇమిడ్చి.. చివర్లో ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే సన్నివేశాలన్నింటిని బాగా తీశారు. ఓ సాధారణమైన అమ్మాయి, మారుమూల ప్రాంతంలో పుట్టిన అమ్మాయి జాతీయ స్థాయి క్రికెటర్ గా ఎదిగిన వైనం స్ఫూర్తిని ఇస్తుంది. సినిమాను సరదగా తెరకెక్కిస్తూనే.. అక్కడక్కడా ఎమోషన్స్ ను క్యారీ చేశారు. దీంతో పటు సెకండ్ హాఫ్ లో సమాజంలోని రైతు పరిస్థితిని వేలెత్తి చూపిస్తూ.. వాళ్ళని గౌరవించమని ఇచ్చిన సందేహం ఆకట్టుకుంటుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలు క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా ఇంచుమించుగా అలానే ఉంటుంది. కాకపోతే రైతులకు సంబంధించిన ఎమోషన్స్ మిక్స్ చేయడంతో.. ఈ ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యాయి.

నటీనటుల పనితీరుః

తమిళంలో కణ సినిమాలో క్రికెటర్ గా నటించి మెప్పించిన ఐశ్వర్య రాజేష్, తెలుగులో కూడా ఆమె నటించడంతో మెప్పించింది. క్రికెటర్ గా చాలా కష్టపడింది. సినిమాను తన భుజస్కందాలపై నడిపించింది. రైతుగా రాజేంద్రప్రసాద్ మెప్పించాడు. అమ్మ పాత్రలో ఝాన్సీ చేసిన నటన బాగుంది. మిగతా నటీనటులు తమ పాత్ర మేరకు మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరుః

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చాలా కాలం తరువాత మరలా మంచి సినిమా తీశాడు. సినిమా అన్ని రకాలుగా బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోసింది. మ్యూజిక్ పర్వాలేదు.

పాజిటివ్ పాయింట్స్ః

కథ

కథం

ఎమోషన్స్

మైనస్ పాయింట్స్ః

కణ సినిమాలోని సన్నివేశాలు కొన్ని యధాతధంగా వాడుకోవడం

చివరిగాః కౌసల్య కృష్ణమూర్తి.. ఓ స్ఫూర్తి

మాగల్ఫ్ రేటింగ్ : 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com