శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. నలుగురు మృతి
- August 23, 2019
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణ జిల్లాలో విషాదం నెలకొంది. కచువాలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో.. దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మమత ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!