SVR విగ్రహావిష్కరణ వాయిదా
- August 24, 2019
విశ్వ నట చక్రవర్తి SV రంగారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్, కె.ఎన్.రోడ్డులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ముహూర్తం నిర్ణయించారు. దీనికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. విగ్రహ ఆవిష్కరణ చేయాల్సిందిగా ఎస్వీఆర్ సమితి సభ్యులు చిరును కలిసి కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని వాయిదా వేసినట్లు సభ్యులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని తెలుస్తోంది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామంటున్నారు.
తాడేపల్లిగూడెం ఎస్‌వీఆర్ సేవా సమితి కొన్ని నెలల కిందట ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. చిరంజీవితో విగ్రహాన్ని ఆవిష్కరింప చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ కార్యక్రమం కూడా వాయిదా పడింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..