227 మంది చిన్నారులు..

- August 28, 2019 , by Maagulf
227 మంది చిన్నారులు..

చిలీ:అది చిలీ దేశం.. పెరూలోని ఓ చారిత్రక ప్రదేశంలో పురావస్తు శాఖ తవ్వినకొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. ఈ అవశేషాలన్నీ 4 నుంచి 14 ఏళ్ల లోపు వారివే. లిమాకు దగ్గర్లో ఉన్న తీర ప్రాంత పట్టణం హువాన్‌చాకోలో 227 మానవ శరీర అవశేషాల్ని కనుగొన్నారు.ఆర్కియాలజిస్టులు.1475లో అంతరించిన ఈ జాతి చిమూ సంస్కృతికి చెందినదిగా పరిశోధకులు తెలిపారు వారు ఆరాధించే దేవుడు కోసం తమకు తాముగా ప్రాణ త్యాగం చేసుకుని వుంటారని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. వారంతా చిన్న పిల్లలు కావడం బాధాకరమన్నారు. ఈ అవశేషాలకు సంబంధించిన పలు విషయాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ సమయంలో నరబలి ఉండేదని వివరించారు. ఎల్ నినో (పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఓ ప్రత్యేక వాతావరణం) సమయంలో ఈ బలులు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

మెుదటిసారిగా రాజధానికి దగ్గరలో ఉన్న పంపాలా క్రజ్‌ వద్ద జరిపిన తవ్వకాల్లో 56 పుర్రెలు వెలికితీశారు. తర్వాత హువాన్‌చాకోలో మరో 190 మంది చిన్నారుల శరీర అవశేషాలను కనుగొన్నారు. మానవ అస్థిపంజరాలతో పాటు 200 ఒంటెల అస్థిపంజరాలు బయటపడ్డాయని అన్నారు. తవ్విన ప్రతి చోటా చిన్నారుల పుర్రెలు, చర్మంతో కూడిన ఎముకల గూళ్లు, తల వెంట్రుకలు బయటపడడం బాధాకరమన్నారు. చిన్నారుల సామూహిక బలి ఆనాటి అనాగరికతకు అద్దం పడుతుందని శాస్త్రవేత్తలు భావోద్వేగంతో వివరించారు. ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బయటపడ్డ అవశేషాలు సముద్రం వైపునకు ఉన్నాయని, వారు ఆ వైపు ప్రాణాలు త్యాగం చేసి ఉంటారని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com