కొత్తగా పెళ్లయింది.. ఆధార్‌లో పేరుని..
- August 28, 2019
అన్నింటికీ ఆధార్ కార్డు.. ఆ ఒక్కటీ ఉంటే చాలు పనులన్నిటికీ అదే ఆధారం. అత్యంత కీలకమైన ధ్రువీకరణ పత్రంగా మారిపోయింది ఆధార్ కార్డు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ధాఖలు చేయాలన్నా ఆధార్ తప్పనిసరైంది. అందువల్ల ఆధార్‌లో మీరు ఇచ్చిన వివరాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ప్రత్యేకించి మహిళల విషయానికి వచ్చేసరికి.. పెళ్లి తరువాత ఇంటి పేరు మార్చుకునే వారు.. ఆధార్‌లో కూడా మార్పులు చేసుకోవలసి ఉంటుంది. ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో ఎలా మార్చుకోవాలో చూద్దాం..
ఆన్లైన్ అప్డేట్ చేయాలంటే.. ముందుగా యూఐడీఏఐ పోర్టల్‌కు వెళ్లాలి. ఆధార్ వివరాలతో లాగిన్ అవ్వాలి. అందులో మీ పేరు, ఇంటి పేరు ఎంటర్ చేయాలి. సెల్ఫ్ అటెస్ట్ (స్వీయ ధ్రువీకరణ), సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి మార్పులు చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇక ఆఫ్‌లైన్‌లో చేసే విధానాన్ని చూస్తే.. దగ్గరలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్లకు సంబంధించిన ఒరిజినల్ కాపీలను కూడా వెంట తీసుకెళ్లాలి. వాటిని ఆధార్ సెంటర్లో ఉన్నవారు స్కాన్ చేసుకొని వెనక్కు తిరిగి ఇస్తారు. తప్పుగా ఉన్న వివరాలను సరి చేస్తారు. అవసరం అనుకుంటే బయోమెట్రిక్ వివరాలను కూడా అప్డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







