దుబాయ్‌లో కొత్త నైట్‌ బస్‌ సర్వీస్‌ ప్రారంభించనున్న ఆర్‌టిఎ

- August 30, 2019 , by Maagulf
దుబాయ్‌లో కొత్త నైట్‌ బస్‌ సర్వీస్‌ ప్రారంభించనున్న ఆర్‌టిఎ

దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ కొత్తగా నైట్‌ పబ్లిక్‌ బస్‌ రూట్‌ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ కొత్త సర్వీస్‌ అందుబాటులోకి వస్తుంది. కాగా, 11 ఇతర రూట్స్‌కి సంబంధించి కనెక్టివిటీని పెంచనున్నట్లు కూడా ఆర్‌టిఎ అధికారులు వివరించారు. ఎన్‌30 పేరుతో నైట్‌ బస్‌, డ్రాగన్‌ మార్ట్‌ 2 (ఇంటర్నేషనల్‌ సిటీ) నుంచి దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు రష్దియా మెట్రో స్టేసన్‌ మీదుగా వెళుతుందని చెప్పారు అధికారులు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ బస్‌ సర్వీస్‌ అందుబాటులో వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com