అబుదాబీ టోల్‌: 100 దిర్హామ్‌లు చెల్లింపుతో వాహనాల రిజిస్ట్రేషన్‌

- September 02, 2019 , by Maagulf
అబుదాబీ టోల్‌: 100 దిర్హామ్‌లు చెల్లింపుతో వాహనాల రిజిస్ట్రేషన్‌

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ - అబుదాబీ, కొత్త టోల్‌ సిస్టమ్‌లో వాహనాల్ని రిజిస్టర్‌ చేయించుకోవడానికి వీలుగా ఓ వెబ్‌సైట్‌ని రూపొందించింది. అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న టోల్‌ విధానానికి సంబంధించి ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వాహనదారులకు అధికారులు సూచించారు. ఎమిరేట్స్‌ ఐడీ, ఎక్స్‌పైరీ డేట్‌, కార్‌ నెంబర్‌ ప్లేట్‌, ఇ-మెయిల్‌ అడ్రస్‌, ఫోన్‌నెంబర్‌, పాస్‌వర్డ్‌ వంటివాటి సాయంతో కొత్త అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపిని ఎంటర్‌ చేశాక రిజిస్టర్‌ అయిన వాహనం / వాహనాల వివరాలు వస్తాయి. అనంతరం 100 దిర్హామ్‌లు ప్రతి వాహనానికీ చెల్లించాల్సి వుంటుంది. ఆ తర్వాత డాష్‌ బోర్డ్‌కి వెళ్ళవచ్చు. అక్కడ ఎంత బ్యాలెన్స్‌ వుందన్నది తెలుస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com