ఓ మై గాడ్ సినిమా రివ్యూ..
- January 08, 2016
తనీష్, మేఘశ్రీ, పావని, విజయ్, జ్యోతి, జీవా, రవి ప్రకాష్, వైజాగ్ ప్రసాద్, ఆశీష్‌గాంధి తదితరులు సంగీతం: రాజ్‌కిరణ్ నేపథ్య సంగీతం: సాలూరి రోషన్ కూర్పు: ఉపేంద్ర ఛాయాగ్రహణం: తోట రాజు నిర్మాత: పురుషోత్తం బాబు రచన దర్శకత్వం: శ్రీ వాస్తవ్ సంస్థ: శ్రీ వెంకటేశ్వర విజువల్స్ విడుదల: 0801 2016 భయం, వినోదం.. నిజానికి ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన అనుభూతులు. అయితే ఈమధ్య ఖహారర్ కామెడీగ అంటూ ఈ రెండింటినీ కలిపి కొన్ని కథలు అల్లుకొంటున్నారు దర్శకులు. నవ్విస్తూ, ఉత్కంఠ రేకెత్తించడం ఈ కథల లక్ష్యం. ఇలాంటివి 1, 2 చిత్రాలు విజయవంతమవ్వడంతో ఇప్పుడు చాలా మంది ఈ తరహా చిత్రాలపై దృష్టి సారించారు. వాటిల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకొనేవి ఎన్ని? అని లెక్కిస్తే.. నిరాశే ఎదురవుతుంది. అలాంటి ఒక ప్రయత్నంగానే ఖఓ మై గాడ్‌గ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథేంటంటే: ఆది (తనీష్)కి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది. అక్కడే విజయ్(విజయ్), ఫణి (జబర్‌దస్త్ ఫణి), చిత్ర(పావని) పరిచయమవుతారు. ఈ నలుగురూ కలసి ఒక ఇల్లు అద్దెకు తీసుకొంటారు. ఆ తర్వాత మరో ముగ్గురితో(జ్యోతి, సత్తన్న, మధుబాబు) ఆ ఇల్లును పంచుకొంటారు. ఈలోగా ఆదికి మాలతి(మేఘశ్రీ)తో పరిచయం అవుతుంది. ఆమె ఇల్లొదిలివచ్చేసి.. తన ప్రేమికుడు రోహిత్ (ఆశీష్ గాంధీ) కోసం వెదుకుతుంటుంది. ఈలోగా ఆదికి తనున్న ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయని తెలుస్తుంది. ఆ దెయ్యాల నుంచి రక్షించమంటూ ఆది ఒక మాంత్రికుడ్ని ఆశ్రయిస్తాడు. ఖదెయ్యాలు ఆ ఇంట్లో లేవు.. నీ స్నేహితులుగా ఉన్న విజయ్, ఫణి, చిత్రలే నిజమైన దెయ్యాలుగ అని తేలుస్తాడా మాంత్రికుడు! మరి ఆ దెయ్యాలు ఆదిని ఎందుకు వెంబడిస్తున్నాయి? స్నేహితులుగా ఎందుకు పరిచయమయ్యాయి? అసలు వాటికేం కావాలి? మాలతి అన్వేషిస్తున్న రోహిత్ ఎవరు? తదితర అంశాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.. ఎలా ఉందంటే..: ఈ సినిమా కథ.. కాస్త తమిళ హీరో సూర్య ఆమధ్య నటించిన ఖరాక్షసుడుగ, తెలుగులో ఇటీవల వచ్చిన ఖవారధిగ చిత్రాలను గుర్తు తెచ్చేలా ఉంది. కథానాయకుడికి కొన్ని ఆత్మలు కనిపించడం.. అవి తమ కోరికల్ని తీర్చుకోవడం కోసం కథానాయకుడిని వాడుకోవడం అనే అంశం చుట్టూ సాగే కథలవి. ఖఓ మై గాడ్‌గ తొలి భాగం కూడా దాదాపు అలానే ఉంటుంది. ద్వితీయార్థంలో కథానాయికని రక్షించుకోవడం కోసం హీరో ఏం చేశాడన్నది కాస్త కొత్తగా అనిపిస్తుందంతే! విశ్రాంతి దగ్గరొచ్చే మలుపు ఆసక్తికరంగా ఉంది. ద్వితీయార్థంలోనూ ఓ కీలకమైన మలుపు ఉంది. అదే ఈ కథకు ప్రాణం. అయితే ఆ రెండు సన్నివేశాల్ని తెరకెక్కించడంలో, కథాగమనంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచడంలో దర్శకుడు మరింత కృషి చేయాలనిపిస్తుంది. హారర్ కామెడీ అని చెప్పినా.. ఆ రెండు లక్షణాలూ చిత్రంలో పెద్దగా కనబడవు. అంతా ఆత్మల గోలే! ఏ ఆత్మ ఎప్పుడు ఎవరిలో ప్రవేశిస్తుందో చెప్పలేం. ఆత్మల కోరికలు.. వాటిని తీర్చడానికి కథానాయకుడు చేసే యత్నాలు కూడా అంత గొప్పగా ఏమీ అనిపించవు. పతాక సన్నివేశం మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే..: ఆది పాత్రధారి తనీష్ బొద్దుగా కనిపిస్తాడు. కొన్ని సీన్లలో కదలికలు బాగా ఇబ్బందిగా చేసినట్లు కనబడింది. నిజానికి ఈ సినిమాలో తన పాత్రకు పెద్దగా చేసేందుకేమీ లేదు. చివర్లో వచ్చే ఓ పోరాట దృశ్యం మాత్రం కాస్త బాగుంది. ఇక కథానాయిక మేఘశ్రీ నటనకు సంబంధించి.. స్క్రీన్‌పై అందంగా ఆకుట్టుకునేలా కనిపించడం గురించి మరింత శ్రద్ధ పెట్టాలనిపిస్తుంది. మిగతా పాత్రధారులూ ఏదో నటించేశారనిపిస్తుంది. జీవా, వైజాగ్ ప్రసాద్, రవిప్రకాష్ వంటి అనుభవజ్ఞులున్నా.. వాళ్ల పాత్రల పరిధి బాగా తక్కువ. మూడు పాటలున్నా... పెద్దగా ఆకట్టుకునేవి లేవు. రాజ్‌కిరణ్ నేపథ్య సంగీతం కాస్త భయపెట్టాలని చూసింది.. కానీ సన్నివేశాల్లో అంత బలం కనబడదు. కెమెరా పనితనం ఆకట్టుకొంటుంది. ఛాయాగ్రహణం.. కథలో మలుపులు బలహీనమైన కథనం వినోదం, భయం రెండూ లేకపోవడం
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







