మహేష్ బాబు చిత్రానికి అదిరిపోయే బిజినెస్ నడుస్తోంది...
- September 04, 2019
సూపర్ స్టార్ మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణంలో కూడా మహేష్ బాబు భాగస్వామిగా ఉన్నారు. హీరోగా రెమ్యునరేషన్ కి బదులుగా, భాగస్వామిగా ఉంటూ నాన్ థియేటర్ హక్కులు తీసుకుంటున్నారనేది ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.
గతంలో మహేష్ బాబు నటించిన సినిమాలను 45 నుండి 46 కోట్ల వరకు నాన్ థియేటర్ హక్కులు వచ్చాయి. ఆ లెక్కన చూసుకుంటే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు మహేష్ కి మంచి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి గాను నాన్ థియేటర్ హక్కులు రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యాభై కోట్లకు పైగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేవలం శాటిలైట్ రైట్స్ కోసం రూ.17 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారట. ఇది కాకుండా డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ ఉండనే ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మార్కెట్ దృష్ట్యా నాన్ థియేటర్ హక్కులు రూ.53 కోట్ల వరకు రావొచ్చని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







