బంగారం ధర భగ భగ

- September 04, 2019 , by Maagulf
బంగారం ధర భగ భగ

బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయ్‌. హైదరాబాద్‌లో 99.9 శాతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల పదిగ్రాముల ధర బుధవారం ఒకేరోజు 537 రూపాయలు పెరిగి 39వేల 590కి చేరింది. ఇక 22 క్యారెట్ల పది గ్రాముల ధర.. 37 వేల 790కి చేరింది. గతవారం ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరుకున్న పుత్తడి ధర చివర్లో తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. బంగారంతో పాటు వెండి మరింత బలపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి 1,080 రూపాయలు పెరిగి రూ.47,960కి చేరుకుంది.

రూపాయి విలువ భారీగా పతనం కావడం కూడా.. బంగారం ధర పెరుగుదలకు కారణమంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ముఖ్యంగా యూఎస్-చైనా ట్రేడ్ వార్ ఫలితంగా ఇప్పటికే బంగారం ధరలు 20 శాతం పెరిగిపోయాయి. భవిష్యత్తులో పసిడి ధరలు అర లక్షకు చేరువైనా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com