హైదరాబాద్ లో కేజీఎఫ్ 2
- September 05, 2019
కేజీఎఫ్..ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్రమైనప్పటికీ అన్ని భాషల్లో డబ్ అయి రికార్డ్స్ బ్రేక్ చేసింది. అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా యష్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా కోలార్ ఫీల్డ్స్‌లోని సైనైడ్ హిల్స్‌లో షూటింగ్ జరుపుతుండగా అక్కడి పర్యావరణానికి హాని కలుగుతుందంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం కూడా ఈయన పిటిషన్ గురించి ఆలోచించి షూటింగ్‌ను ఆపాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశం తో ఈ సినిమా షూటింగ్ ను హైదరాబాద్, బెంగుళూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ సెట్లలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







