సంగీత దర్శకుడిని కాపాడిన హీరో సాయి ధరమ్ తేజ్
- September 05, 2019
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్నారు. కళ్ల ముందే ఓ యాక్సిడెంట్.. మరో ఆలోచన లేకుండా మానవత్వం ఉన్న మనిషిగా స్పందించారు. సకాలంలో అతడికి వైద్యం అందేందుకు సాయపడి నిజమైన హీరో అనిపించుకున్నారు సాయి ధరమ్ తేజ్. నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ముగించుకుని బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ మీదుగా ఇంటికి వెళుతున్నారు . అంతలో రోడ్డు నెం.42 లోని ఓ మూలమలుపు దగ్గర బైక్ పై వస్తున్న ఓ వ్యక్తి అదుపు తప్పి అటుగా వస్తున్న కారును ఢీకొట్టారు. దీంతో బైక్ పై నున్న వ్యక్తి సుమారు 10 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. కళ్ల ముందు జరిగిన ప్రమాదంతో హతాశుడైన సాయి ధరమ్ హుటాహుటిన కారు దిగి యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి దగ్గరకు వెళ్లారు. తరచి చూడగా తనకు తెలిసిన వాడేనని గుర్తించారు. అతడు యువ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి అని తెలుసుకున్నారు. మరో వ్యక్తి సాయంతో తేజ.. బాధితుడిని తన చేతులపై మోసుకొచ్చి తన కారులోనే.. సమీపంలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో అచ్చు కాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం అచ్చు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







