తెలంగాణ:హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంచారు..
- September 05, 2019
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పది, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువు ముగిసిపోయింది. అయితే దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి సెప్టెంబర్ 4తోనే దరఖాస్తు గడువు ముగిసింది. పాత గడువుని సవరిస్తూ మరో రెండు వారాలు అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టులు: 1,539.. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా.. వయసు: 01.07.2019 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.09.2019
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







