హోటల్ బాత్ రూమ్‌లో ఎలుగుబంటి...
- September 09, 2019
అమెరికా:రెస్టారెంట్‌లో బస చేయడానికి వెళ్లిన మహిళకు అనుకోని ఘటన ఎదురైంది. అక్కడ ఉన్న వాష్ రూమ్ తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన ఆ మహిళకు ఓ అతిథి వెల్‌కం చెప్పింది. దీంతో ఆమె కేకలు పెడుతూ బయటికి పరుగులు తీసింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మొంటనా కౌంటీలోని గల్లటిన్ ప్రాంతంలోని బక్స్ టీ 4 లాడ్జ్ అండ్ రెస్టారెంట్‌లో ఓ మహిళ బస చేయడానికి వెళ్లింది. అక్కడ ఉన్న గదిలోని వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. అందులో ఉన్న ఎలుగుబంటిని చూసింది. అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి వాష్ రూమ్‌లోకి రావటంతో.. ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయింది. దీంతో ఆమె గట్టిగా అరుస్తూ.. రూమ్ నుంచి బయటకు వచ్చి హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ సిబ్బంది సహకారంతో ఎలుగుబంటిని బంధించి అడవిలో వదిలిపెట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని మహిళ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







