తెలంగాణ జాగృతి ఖతార్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించిన జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

- September 09, 2019 , by Maagulf
తెలంగాణ జాగృతి ఖతార్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించిన జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

తెలంగాణ మట్టి వాసనల మకరందం బతుకమ్మ. ప్రకృతిని అమ్మగా ఆది శక్తిగా కొలిచే ఘనమైన పండుగ ఇది. వందల వేల సంవత్సరాలుగా వస్తున్న మన ఈ పూల పండుగను నేడు తెలంగాణలోనే కాక తెలంగాణకు ఆవల ఉన్న తెలంగాణ ఆడబిడ్డలు అన్నదమ్ములు కూడా ప్రతీ ఏడు అత్యంత అనందోత్సాహాలతో జరుపుకోవడం తెలిసిన విషయమే. అదే క్రమంలో తెలంగాణ జాగృతి  ఖతార్ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నిర్వహించనున్న 'జానపద బతుకమ్మ' పోస్టర్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.కవిత మాట్లాడుతూ ఏ గడ్డపై ఉన్నా స్వీయ సంస్కృతి పై మక్కువతో, మాతృభూమి పై మమకారంతో మన సంస్కృతి ని పండుగలను ప్రవాస తెలంగాణీయులు జరుపుకుంటూ ఉండడం సంతోషకరమన్నారు. ఈ సారి జానపద కళాకారులకు పెద్దపీట వేస్తు కార్యక్రమం రూపొందించామని ఖతార్ తెలంగాణ జాగృతి శాఖ అధ్యక్షులు నందిని అబ్బగౌని అన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీధర్ అబ్బాగౌని, అభిలాష్ బండి‌, ప్రశాంత్ పూస మరియు పావని గణేష్ తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ నిర్వహిస్తున్న 'జానపద బతుకమ్మ'  అక్టోబర్ 4న దోహా ఖతార్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్, అశోక హాల్ లో సాయంత్రం 4గం.లకు ప్రారంభమవుతుందని నందిని అబ్బగోని తెలిపారు. 

----రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com