కొలీగ్‌పై క్లీనర్ అత్యాచారం
- September 09, 2019
యూఏఈ: 28 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి, కొలీగ్ అయిన నేపాలీ మహిళపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పనిచేస్తున్న బిల్డింగ్‌లోని స్టోరేజ్ రూమ్‌లో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. జూన్ 7న ఈ ఘటన చోటు చేసుకుంది. విచారణలో నిందితుడు, తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. మరోపక్క, ఫోరెన్సిక్ పరీక్షల్లోనూ నిందితుడి నేరం నిరూపితమయ్యింది. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. ఘటన జరిగిన తర్వాత తాను విషయాన్ని ఇండియన్ సూపర్వైజర్కి తెలపగా, ఆమె సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొంది.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







