25 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్
- September 09, 2019
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించి.. ఇప్పటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో సినీ దిగ్గజాలంతా ఒకే వేదికపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సహా పలువరు నేతలు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే.. పలువురు సినీ ప్రముఖులకు అవార్డులను బహుమతి చేశారు. దీనికి టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేశ్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమం ఆసాంతం ఉల్లాసంగా సాగింది. తారల తళుక్కులు, టెక్నీషియన్ల ప్రదర్శనలు, ఫ్యాన్స్ కేరింతలతో ఈ వేడుకను ఆంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు హామీ ఇచ్చారు. 'సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుంది. ఊటీలాగే కాశ్మీర్‌ను కూడా షూటింగ్ చేసుకోడానికి అనుకూలంగా అభివృద్ధి చేస్తాం. అక్కడ ఫిల్మ్ స్టూడియోలు నిర్మించుకోడానికి అవకాశాలు కల్పిస్తాం' అని ఆయన చెప్పారు.
ఇక, ఇదే వేడుకలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మధ్య చర్చలు జరిగాయి. అలాగే, ఒక హీరోయిన్ అలిగి వెళ్లిపోయిందన్న కామెంట్లు కూడా వినిపించాయి. మొత్తంగా ఈ వేడుకకు కృష్ణ, కోటా శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, రాజేశేఖర్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నిహారిక, నాగబాబు, రామ్ లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశి ఖన్నా, రెజీనా, ప్రగ్యా జస్వాల్, పూజా హెగ్డే, గిరిబాబు, శ్రీకాంత్, అశ్వినిదత్, బోయపాటి శ్రీను, సాయి ధరమ్ తేజ్ తదితరులు విచ్చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..