ట్రక్‌లో దాక్కున్న 18 మంది ఇల్లీగల్ వర్కర్స్
- September 10, 2019
యూఏఈ: ఓ ట్రక్‌లో దాక్కుని అక్రమంగా యూఏఈలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా, వారిని అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అల్ అయిన్‌లోని కతామ్ అల్ షక్లా పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అబుదాబీ కస్టమ్స్‌తో కలిసి పోలీసులు ఈ ఆపరేషన్‌ని చేపట్టారు. ఇలా దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారి కారణంగా అసాంఘీక కార్యకలాపాలు పెరుగుతాయనీ, దోపిడీలు, హత్యలు వంటి ఘటనలు చోటు చేసుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, అరెస్ట్ చేసినవారిలో మహిళలు కూడా వున్నారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







