దుబాయ్ గ్లోబల్ విలేజ్ కొత్త సీజన్ అతి త్వరలో ప్రారంభం
- September 10, 2019
దుబాయ్: దుబాయ్ గ్లోబల్ విలేజ్, వచ్చే నెలలో 24వ సీజన్‌తో సందర్శకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 29న ఈ సీజన్ ప్రారంభమవుతుంది. 2020 ఏప్రిల్ 4 వరకు ఈ కొత్త సీజన్ సందర్శకులకు అందుబాటులో వుంటుంది. మొత్తం 3,500కి పైగా షాపింగ్ ఔట్‌లెట్స్‌తో, 79 దేశాలకు చెందిన సంస్థలు తమ ప్రోడక్ట్స్‌ని ఇక్కడ అందుబాటులో వుంచుతాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్న సమయంలో ఈ గ్లోబల్ విలేజ్ సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకోనుంది. మొత్తంగా 20,000కి పైగా ఎంటర్టైన్మెంట్ మరియు కల్చరల్ షోలు ఈసారి సందర్శకుల్ని అలరించబోతున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో అంతర్జాతీయ కళాకారుల ప్రదర్శనలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. గురు, శుక్రవారాల్లో ఫైర్ వర్క్స్ మరో ప్రధాన ఆకర్షణ అని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







