దుబాయ్‌ గ్లోబల్‌ విలేజ్‌ కొత్త సీజన్‌ అతి త్వరలో ప్రారంభం

- September 10, 2019 , by Maagulf
దుబాయ్‌ గ్లోబల్‌ విలేజ్‌ కొత్త సీజన్‌ అతి త్వరలో ప్రారంభం

దుబాయ్‌: దుబాయ్‌ గ్లోబల్‌ విలేజ్‌, వచ్చే నెలలో 24వ సీజన్‌తో సందర్శకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్‌ 29న ఈ సీజన్‌ ప్రారంభమవుతుంది. 2020 ఏప్రిల్‌ 4 వరకు ఈ కొత్త సీజన్‌ సందర్శకులకు అందుబాటులో వుంటుంది. మొత్తం 3,500కి పైగా షాపింగ్‌ ఔట్‌లెట్స్‌తో, 79 దేశాలకు చెందిన సంస్థలు తమ ప్రోడక్ట్స్‌ని ఇక్కడ అందుబాటులో వుంచుతాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్న సమయంలో ఈ గ్లోబల్‌ విలేజ్‌ సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకోనుంది. మొత్తంగా 20,000కి పైగా ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు కల్చరల్‌ షోలు ఈసారి సందర్శకుల్ని అలరించబోతున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో అంతర్జాతీయ కళాకారుల ప్రదర్శనలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. గురు, శుక్రవారాల్లో ఫైర్‌ వర్క్స్‌ మరో ప్రధాన ఆకర్షణ అని నిర్వాహకులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com