భర్తపై ఫిర్యాదు చేసిన భార్య..భర్తకి గాయాలు.!

భర్తపై ఫిర్యాదు చేసిన భార్య..భర్తకి గాయాలు.!

కువైట్‌: ఓ ఇరానీ మహిళ, తన భర్త తనను శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, విచారణ సందర్భంగా అధికారులకు ఆశ్చర్యం గొలిపే వాస్తవాలు తెలిశాయి. ఈ కేసులో భర్త నిందితుడు కాదనీ, బాధితుడనీ తేల్చారు. భర్త శరీరంపై తీవ్రమైన గాయాల్ని అధికారులు గుర్తించారు. ఆ గాయాలకు భార్య కారణమని పోలీసులు నిర్ధారించడం జరిగింది. మెడికల్‌ రిపోర్ట్స్‌ని సాక్ష్యంగా అధికారులు చూపించడం జరుగుతోంది. ఈ జంటని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి అప్పగించారు.  

 

Back to Top