సాహో దర్శకుడు సుజీత్ ను టార్గెట్ చేస్తున్నారట!
- September 11, 2019
సుజీత్ దర్శకత్వం లో ఇటీవలే వచ్చిన సినిమా సాహో. ఈ సినిమా అనూహ్యం గా బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలమవడం తో సుజీత్ మీద నెగటివిటీ పెరిగిపోయింది కానీ సుజీత్ దానిని తప్పుగా అర్ధం చేసుకున్నాడు. ఇటీవలే డెంగీ జ్వరం బారిన పడి కోలుకుంటున్న సుజీత్ తాజాగా సాహో' విషయంలో తనపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అవుతూ… 'నేను ప్రభాస్ సర్‌తో సినిమా చేశాను. నా నిర్మాతలు, నేను కథను నమ్మి తీశాం. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ చిత్రం చూశారు. అయినప్పటికీ నేను ఏదో నేరం చేసినట్లు ట్రీట్ చేస్తున్నారు' అని చెప్పుకొచ్చారు. నన్ను టార్గెట్ చేస్తూ అందరూ ఎందుకు వార్తలు రాస్తున్నారో అర్థం కావడం లేదు. నేను చివరగా మూవీ రిలీజైన ఒక రోజు తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను. 'నో కామెంట్స్' అని నేను చెప్పినా కూడా అది ఇంటర్వ్యూగా మారిపోతోంది, ఆ కామెంట్లను కూడా నాకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని సుజీత్ తెలిపారు.
నేను మూర్ఖంగా గొప్పులు చెప్పుకునే రకం కాదు. అభిమానులు రజనీకాంత్, మమ్ముట్టి లాంటి గొప్ప గొప్ప స్టార్ల కోసం ఆలయాలు కట్టారు. అలాంటి ఆలయాల వద్ద నేను భక్తుడిని మాత్రమే. సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టే నేను మీడియాకు దూరంగా ఉంటున్నాను. సినిమాను ప్రేమించండి లేదా ద్వేషించండి. అంతే కానీ నన్ను టార్గెట్ చేయడం ఎందకు? అని సుజీత్ వాపోయారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..