50ఏళ్ల అభివృద్ధి: కె.తారక రామారావు

- January 09, 2016 , by Maagulf
50ఏళ్ల అభివృద్ధి: కె.తారక రామారావు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో వంద సీట్లు సాధించి, బల్దియా పీఠం కైవసం చేసుకుంటామని తెలంగాణ పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. బల్దియా పోరులో గెలుపు గుర్రాల వడపోత త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. తెరాస 18 నెలల పాలనే గీటురాయిగా ప్రజల్లోకి వెళ్తామని, మహిళలకు సమాన అవకాశాలుండాలనే 50శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు పేర్కొన్నారు. హరీష్‌రావుతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్న కేటీఆర్‌, వీలును బట్టి గ్రేటర్‌లో ముఖ్యమంత్రి ప్రచార సభలు ఉంటాయని వివరించారు. ఐదేళ్లు హైదరాబాద్‌ను అప్పగిస్తే 50ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com