పఠాన్‌కోట్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ..
- January 09, 2016
ప్రధాని నరేంద్ర మోడీ పఠాన్‌కోట్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. ఉగ్రవాదుల దాడుల్లో గాయపడిన జవాన్లను మోడీ పరామర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పఠాన్‌కోట్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా మోడీ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి భద్రతా దళాలు భద్రత కట్టుదిట్టం చేశారు. అనంతరం ఆర్మీ అధికారులతో మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఆరుగురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







