నవ్వు ఎంత పనిచేసింది..

- September 11, 2019 , by Maagulf
నవ్వు ఎంత పనిచేసింది..

చైనా:జీవితంలో ఏదైనా మోతాదుకు మించితే ముప్పు తప్పదు.. మనం చేసే ప్రతి పని లిమిట్‌లోనే ఉండాలి.. కాదని అతి ఉత్సాహంతో చేస్తే మాత్రం అనార్ధమే. అందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే ఉదాహరణ నిలిచింది. అతిగా పగల్బడి నవ్వి చైనాకు చెందిన ఓ మహిళ చిక్కుల్లో పడింది. ఏదైనా హస్యభరిత సన్నివేశం చూసినప్పుడు కానీ చూట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా జోక్ వేసినప్పుడు ముసిముసిగా లేదా పగల్బడి నవ్వడం సహజం. కానీ ఆ మహిళకు అలా నవ్వడమే శాపమైంది.

చైనాలోని హైస్పీడ్ రైల్‌లో ప్రయాణిస్తున్న మహిళ తోటి ప్రయాణికుడు వేసిన జోకుకు ఆనందంతో నవ్వేసింది. ఆమె ఎంతలా నవ్విందంటే తన నవ్వు దెబ్బకు ఆమె దవడ పక్కకు జరిగిపోయింది. నవ్వేందుకు తెరిచిన నోరు మూయడానికి కూడా వీలుపడలేదు. యథాస్థితికి రావడానికి ఆ మహిళ ఎంత ప్రయత్నించిన కుదరలేదు. మూసేందుకు వీలుపడక ఆ మహిళ తీవ్ర అవస్థను ఎదుర్కొంది. చివరకు ఆ నవ్వు ఆమె దుఃఖానికి కారణమైంది. ఉన్నట్టుండి తన నోరు అలా అవ్వడంతో ఏం చేయాలో తెలియక కిందపడి దొర్లింది. ఈ సంఘటన చైనాలోని గ్వాంగ్‌ఝౌ దక్షిణ రైల్వే స్టేషన్‌కు వెళుతున్న హైస్పీడ్‌ ట్రైన్ లో  చోటుచేసుకుంది.

ఆమె పరిస్థితిని చూసిన రైల్వే సిబ్బంది డాక్టర్‌ని పిలిపించారు. ఆ వైద్యుడు కష్టపడి దవడను సరిచేసి ఆమెకు ఉపశమనం కల్పించారు. ఇలా జగడానికి గల కారణాన్ని ఆ మహిళ అధికారులకు వివరించింది. తను గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్రమైన వాంతులతో బాధపడ్డానని ఆ సమయంలో తన దవడ పక్కకు జరిగిందని తెలిపింది. దీంతో డాక్టర్‌ను సంప్రదించగా పెద్దగా నవ్వడం..నోటిని బారుగా తెరవడం వంటివి చేయరాదని వైద్యుడు సూచించినట్లుగా ఆ మహిళ వివరించింది. నోరు మూయడానికి రాక అవస్థ పడుతున్న బాధిత మహిళ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నవ్వు నాలుగు విధాల చేటు అని పెద్దలు చెప్పిన మాట ఎంత నిజామో ఆమెకు తెలిసోచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com