ఆమిర్ ఖాన్ తో నటించనున్న యోగిబాబు
- September 15, 2019కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు ఓ బాలీవుడ్ చిత్రంలో నటించ నున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నటించనున్న మొదటి చిత్రం అది కూడా బాలీవుడ్ స్టార్‌హీరో ఆమీర్‌ఖాన్ చిత్రం కావడం విశేషం. అమీర్‌ఖాన్ నటించనున్న ఓ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆమీర్‌ఖాన్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఆ చిత్ర ప్రారంభ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో హస్యనటుడు యోగిబాబు కూడా ఈ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఇటీవల యోగిబాబు కూడా ఈ విషయంపై స్పందించి ప్రస్తుతం ఆమీర్‌ఖాన్ నటించనున్న చిత్రంలో నటించేందుకుగాను చర్చలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుందని తెలిపారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి తమిళుడి పాత్రలోనే నటిస్తుండడంతో ఆయన స్నేహితుడి పాత్రలో యోగిబాబు నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా