డిసెంబర్ 20న విడుదల కానున్న డిస్కో రాజా
- September 15, 2019
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20,2019న విడుదల కానుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్ ' ఫేమ్ నభా నటేశ్‌ను ఓ నాయికగా, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను మరో నాయికగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొద్ది రోజులుగా చిత్రం గోవా షెడ్యూల్ జరుపుకుంటుండగా, రీసెంట్గా పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేసి అనుకున్నటైంకి సినిమాని పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







