ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
- September 15, 2019
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు ఆధార్ కార్డు పొందేందుకు స్వదేశంలో 3 నెలలు ఉన్నా సరిపోతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు యూఐడీఏఐ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తామని సీఈవో అజయ్ భూషణ్ పాండే చెప్పారు. గతంలో స్వదేశంలో కనీసం 180 రోజులు ఉన్న వారికే ఆధార్‌కార్డు ఇచ్చేవారు. ఇక నుంచి విదేశాల్లో ఉండగానే పాస్‌పోర్టు ఆధారంగా ఆధార్‌కార్డు టైమ్ స్లాట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, తాము కార్డు తీసుకోవాలనుకునే కేంద్రాన్ని కూడా అప్పుడే పేర్కొనాలని పాండే తెలిపారు. స్వదేశానికి వచ్చిన తర్వాత 90 రోజుల్లో ఆధార్ కేంద్రానికి వెళ్లి కార్డు పొందవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







